TTD: లడ్డూ అపవిత్రం వివాదం.. శ్రీవారి ఆలయంలో రేపు శాంతి హోమం

4 months ago 5
తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం ఆరు నుంచి పది వరకూ శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహించనుంది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. యాగం కోసం మూడు హోమ గుండాలు ఏర్పాటు చేయనున్నారు. భక్తుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించడానికి ఈ హోమం చేస్తున్నట్లు శ్యామలరావు తెలిపారు. ఆగస్టులో జరిపిన పవిత్రోత్సవాలతోనే దోషాలు తొలగిపోయాయని.. అయితే భక్తుల ఆందోళన తగ్గించేందుకు రేపు శాంతి యాగం చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Entire Article