తిరుమలలో దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. అన్నప్రసాద భవనంలో సిబ్బంది పెంపు, శ్రీవారి భక్తుల కోసం టాయిలెట్ల నిర్మాణంతో పాటుగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే తిరుమలకు వచ్చే భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు.