Tungabhadra: భారీ వర్షాలు, వరదలకు తుంగభద్ర నది డ్యామ్ గేటు కొట్టుకుపోయింది. దీంతో లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో అప్రమత్తమైన అధికారులు.. హెచ్చరికలు జారీ చేశారు. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. వరద ఎక్కువగా ఉండటంతో గేటు మరమ్మతులకు అడ్డంకిగా మారింది. ఇక పనులు పూర్తయ్యేవరకు డ్యామ్ నుంచి నీరు కిందికి వరద ప్రవాహం కొనసాగనుంది. మరోవైపు.. ఈ విషయంపై సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీశారు.