Uchitha Pantala Bheema: ఆంధ్రప్రదేశ్‌లో రైతులందరికీ.. చంద్రబాబు సర్కార్ శుభవార్త అందించింది. ఉచిత పంటల బీమాపై కీలక నిర్ణయం తీసుకుంది. పంటల బీమాకు సంబంధించి.. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. 2019 కంటే ముందు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన విధానాన్నే తిరిగి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ - పంటలో నమోదైతే ఉచిత పంటల బీమాను అమలు చేయనున్నారు.