West Godavari District Parcel Dead Body: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్‌బాడీ కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో భయంతో వణికిపోయారు. మహిళ కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి మహిళకు ఆ పార్శిల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు మహిళ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు.