Union Budget 2025: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ 2025పై అందరి ఆసక్తి నెలకొంది. మధ్యతరగతి వేతన జీవులతో పాటుగా పారిశ్రామిక రంగాలు, రైతులు ఇలా అందరూ కేంద్రం ఏ ప్రకటిస్తుందనే దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందనేదీ ఆసక్తికరంగా మారింది. జులై 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బిహార్, ఏపీలకు అధిక ప్రాధాన్యం దక్కింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా.. ఢిల్లీలో నాయుడు గారి మాట నెగ్గుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.