Visakhapatnam Vande Bharat Express Trains Maintenance Complex Vande Bharat Bhavan: విశాఖపట్నంలో వందేభారత్ రైళ్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. తాజాగా మరో ఫ్లోర్ నిర్మించి వందేభారత్ భవన్‌గా పేరు పెట్టారు. అంతేకాదు మర్రిపాలెంలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా మరో కోచ్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఇప్పటికే కేంద్రం రూ.299 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.