కేంద్రం నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రావాల్సిన నిధులు విడుదల కాకపోయినా లబ్ధిదారుల చివరి బిల్లుల చెల్లింపును రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లను చివరి బిల్లుల కింద విడుదల చేస్తున్నామన్నారు. ఈ మొత్తం గురువారం ఖాతాల్లో జమ కానుందని చెప్పారు. మిగిలిన లబ్ధిదారులకు దశలవారీగా చెల్లింపులు చేస్తామని అన్నారు. రెండో విడత లబ్ధిదారుల ఎంపికను సెప్టెంబరు 15 నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.