ఏపీలో మరో వందేభారత్ రైలు పట్టాలెక్కనున్నట్లు సమాచారం. విశాఖపట్నం - దుర్గ్ మార్గంలో వందేభారత్ రైలును ప్రారంభించనున్నట్లు సమాచారం. విశాఖ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా మూడో వందేభారత్ రైలును ప్రారంభించే యోచనలో రైల్వేశాఖ ఉన్నట్లు సమాచారం. అయితే వాల్తేరు డివిజన్ నుంచి దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఒడిశా ప్రభుత్వం ఈ రైలును ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.