వేములవాడలో భక్తులకు రక్షణ కల్పించాల్సిన ఓ మహిళ హోంగార్డు.. భక్షకురాలైంది. భర్తకు ఆరోగ్యం బాగోలేదని చెప్తూ.. పెద్ద పెద్ద తలకాయలను వలలో వేసుకుని.. అందినకాడికి అప్పుగా డబ్బులు లాగుతుంది. తీరా అప్పు తిరిగి చెల్లించాలని అడిగితే.. ఫొటోలు మార్ఫింగ్ చేసి.. బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసి.. ఇచ్చిన డబ్బులు తిరిగివ్వకపోగా పైనుంచి అందుకు డబుల్ డబ్బులు వసూలు చేస్తే పెద్ద బాగోతమే మొదలుపెట్టింది.