దసరా వచ్చిందంటే చాలు అమ్మవారి ఆలయాలు కిటకిటలాడిపోతుంటాయి. మరీ ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గ గుడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకల నిర్వహణపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు.