విజయవాడలో వరద బాధితులపై వీఆర్వో చేయిచేసుకోవటంపై ప్రభుత్వం స్పందించింది. బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన వీఆర్వో జయలక్ష్మికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. అజిత్ సింగ్ నగర్‌లో ఆహారం, మంచినీరు అందడం లేదంటూ వరద బాధితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే వీఆర్వోపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఇది కాస్తా వాగ్వాదానికి దారితీయగా.. సహనం కోల్పోయిన వీఆర్వో బాధితులపై చేయి చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావటంతో ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది.