Vijayawada: దుర్గమ్మ భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి 18 రోజుల పాటు ఘాట్‌ రోడ్డు మూసివేత

3 months ago 19
విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులు దాదాపు మూడు వారాల పాటు మెట్ల మార్గం లేదా లిఫ్ట్ దారిలో వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేయనున్నారు. వాహనాల్లో నేరుగా ఆలయానికి చేరుకోవడం మే 26 నుంచి జూన్ 12 వరకు నిషేధం విధించారు. మరమ్మత్తు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. దీనిని భక్తులు గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఆలయ మండలి తెలిపింది.
Read Entire Article