హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీగా నగదు, నగలు చోరీ జరిగిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఫిలింనగర్ రోడ్డు నెంబర్ 8లో నివసిస్తున్న విశ్వక్ సేన్ ఇంట్లోకి చొరబడిన దుండగులు దాదాపు రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశ్వక్ సేన్ కుటుంబ సభ్యులంతా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు.