విశాఖ విమానాశ్రయంలో అరుదైన జీవులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. థాయిలాండ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేసిన డీఆర్ఐ అధికారులు.. లగేజీలో కేక్ బాక్సులు ఉన్నట్లు గుర్తించారు. అయితే అనుమానం కొద్దీ కేక్ బాక్సులను తెరిచి చూసిన అధికారులు షాక్ తిన్నారు. నీలి రంగు నాలుక కలిగిన అరుదైన బల్లులు అందులో కనిపించాయి. మొత్తం ఆరు బల్లులను అక్రమంగా రవాణఆ చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఇద్దరినీ అరెస్ట్ చేశారు.