విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. గత మూడేళ్లుగా ఇదే నినాదంతో కార్మికులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించడంతో ఉద్యోగులు నిరసనలు కొనసాగిస్తున్నారు. నష్టాల్లో ఉందనే సాకుతో ప్రయివేట్‌కు అప్పగించేందుకు కేంద్ర సర్కారు సమయాత్తమవుతోంది. అయితే, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న కార్మికులు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటీకరణకు అంగీకరించబోమని అంటున్నారు. దీనిని సెయిల్‌లో విలీనం చేయాలని పట్టుబడుతున్నారు. ఈ విషయంలో కేంద్రం కొంత సానుకూలంగా ఉన్నట్టు నివేదికలు అందుతున్నాయి.