ఈ నెల 21న విశాఖలోని ఆక్సిజన్ టవర్స్‌లో డెలివరీ బాయ్‌పై దాడి ఘటన గురించి తెలిసిందే. ప్రస్తుతం ఆ దాడికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో డెలివరీ బాయ్‌పై ప్రసాద్ అనే వ్యక్తి దాడి చేసిన సీన్ మొత్తం రికార్డైంది. నగరంలోని సీతమ్మ ధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో స్విగ్గి డెలివరీ బాయ్ అనిల్ ఆర్డర్ డెలివరీ కోసం ప్రసాద్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అతడిని బ్రో అని పిలవడంతో ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘నన్ను సార్ అని పిలవాలి. బ్రో అని కాదు’ అంటూ అనిల్‌పై దాడి చేశాడు. అంతే కాకుండా సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో అనిల్‌ను కొట్టి అతడి బట్టలు చించి గేటు వద్ద నిలబెట్టి క్షమాపణ లేఖ రాయాలని బలవంతం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిపై డెలివరీ బాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రసాద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.