Vizag: నగరవాసులకు అలర్ట్.. రేపు (మార్చి23) ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

1 month ago 6
విశాఖ ప్రజలకు ముఖ్య గమనిక. మెయిన్ పంపింగ్ స్టేషన్‌లోని పాత మోటార్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మార్చి 23వ తేదీ సోమవారం విశాఖలోని పలు ప్రాంతాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. అలాగే అంతర్జాతీయ నీటి దినోత్సవం సందర్భంగా.. నీటిని పొదుపుగా, బాధ్యతాయుతంగా వాడుకోవాలని కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు.
Read Entire Article