సైబరాబాద్ పరిధిలోని రామచంద్రాపురంలో ఓ ఆలయ గర్భగుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న వృద్ధుడు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. ఆలయానికి బయట నుంచి తాళం వేసి ఉండటంతో అనుమానించిన వారు లోపలికి వెళ్లి అతడిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.