వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట డీసీసీబీ శాఖలో 96.1 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీ కోసం వచ్చిన మరో డీసీసీబీ మేనేజరే బంగారం కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆడిటర్ల తనిఖీలో చోరీ బయటపడటంతో కేసు నమోదైంది. అనంతరం చోరీ సొత్తు తిరిగి లభించగా కేసును రాజీ చేసేందుకు బ్యాంకు అధికారులు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు పోలీసులు అంగీకరించలేదని.. న్యాయస్థానంలోనే రాజీ ప్రక్రియ జరగాలని స్పష్టం చేశారు.