సెల్‌ఫోన్ చూడొద్దన్నందుకు ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఓ 13 ఏళ్ల బాలుడు సెల్ ఫోన్‌లో ఆన్ లైన్ గేమ్స్, హర్రర్ వీడియోలు చూడ్డానికి అలవాటు పడ్డాడు. అయితే ఇంట్లో వాళ్లు సెల్ ఫోన్ మాన్పించాలనే ఉద్దేశంతో బాలుడిని మందలించినట్లు తెలిసింది. దీంతో బాలుడు షూ లేస్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి తాతయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.