AP Skill Development Corporation Cheepurupalli Job Mela: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. జిల్లాలు, నియోజకవర్గ స్థాయిలో వీటిని నిర్వహిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఈ నెల 29న జాబ్ మేళాను నిర్వహస్తున్నారు. మొత్తం 23 కంపెనీలలో 1490 ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.