ఖాతాదారుల కోసం తపాలా శాఖ అనేక పథకాలు అందిస్తోంది. అందులో ప్రధానంగా బీమా పథకాలు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా పరిహారం వర్తించే పథకాలను తపాలా శాఖ అమలుచేస్తోంది. విజయనగరం జిల్లా తపాలా శాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. తపాలా శాఖ ఆధ్వర్యంలోని ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకులో రూ.100లతో అకౌంట్ ఓపెన్ చేయించుకుంటే.. ఆ ఖాతాదారులకు పలు బీమా పథకాలను అమలు చేస్తున్నామని విజయనగరం తపాలా శాఖ సూపరింటెండెంటు శ్రీనివాసులు తెలిపారు.