VRO: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థను మళ్లీ తిరిగి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మొత్తం దాదాపు 11 వేల రెవెన్యూ గ్రామాలు ఉండగా.. ప్రతీ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసి.. ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వారితోపాటు కొత్తగా నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలని చూస్తోంది.