Telangana Earthquake: తెలంగాణలో డిసెంబర్ 4న ఉదయం భూప్రకంపనలు కలకలం రేపాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భూమి కంపించింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున 7.30 గంటల సమయంలో భూమి కంపించిందని తెలిసింది. అంతకుముందు 2023, ఆగస్ట్ 25న కూడా భూప్రకంపనలు సంభవించాయి.