Ponguleti Srinivas Reddy: తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్ నగరం రాజధానిగా ఉండగా.. రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన కార్యచరణ కూడా రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వరంగల్‌లో జెండా ఆవిష్కరించి.. lతెలంగాణ ప్రజాపాలన దినోత్సవాలల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి కీలక ప్రసంగం చేశారు.