Weather Update: ఏపీవాసులకు అలర్ట్.. వరుస అల్పపీడనాలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

9 months ago 26
ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం రోజున కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అలాగే నవంబర్ 21న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని..దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది.
Read Entire Article