SBI Donated Rs 5 Crore TO Andhra Pradesh CM Relief Fund: ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన బాధితులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండగా నిలిచింది. తుఫాన్ సహాయ కార్యక్రమాలు అందించేందుకుఎస్‌బీఐ భారీ విరాళాన్ని అందించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ తరఫున రూ.5.01 కోట్ల విరాళాన్ని అందించారు. సర్కిల్ పరిధిలోని అధికారులు, ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని ఈ విరాళంగా అందజేశారు.