హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణలోని 16 జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రైతులు తమ ధాన్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.