ఏపీ ప్రభుత్వం తన భద్రతను తగ్గించిందని.. పునరుద్ధరించేలా ఆదేశించాలంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ మూడో తేదీ నాటికి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అయితే వైఎస్ జగన్ పిటిషన్ మీద ప్రభుత్వం స్పందించింది. వైఎస్ జగన్ భద్రతను తగ్గించలేదన్న అధికారులు.. రూల్స్ ప్రకారం ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇస్తున్నట్లు తెలిపారు. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే సెక్యూరిటీని మాత్రమే కుదించామని.. సీఎం స్థాయి సెక్యూరిటీ ఇవ్వలేమని తెలిపాయి. వైఎస్ జగన్‌కు ఇప్పటికీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు స్పష్టం చేశాయి.