YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తిరుమల పర్యటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని కొందరు హిందూ ధార్మిక సంఘాల నేతలు చెబుతుండగా.. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ తిరుమలకు ప్రవేశించాలని అధికార కూటమి నేతలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు విధించారు.