గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన దాడిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. మహిళను వివస్త్రను చేసి టీడీపీ నాయకుడు, అతని కుటుంబం దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి, ఆమెకు రక్షణ కల్పించి, నిందితుణ్ని అరెస్ట్ చేసి ఉంటే.. ఈ ఘోరం జరిగేది కాదు కదా అని ప్రశ్నించారు. ఇదేనా మీ పోలీసింగ్,. ఇదేనా మీ సుపరిపాలన అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.