శంషాబాద్ కేంద్రంగా చెన్నై, బెంగళూరు, ముంబై దిశల్లో ప్రతిపాదించిన మూడు హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ల మ్యాప్‌కు తెలంగాణ కేబినెట్ అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. భారత్ ఫ్యూచర్ సిటీ, సైబరాబాద్ మీదుగా ఈ కారిడార్ల ఎలైన్‌మెంట్లను ఖరారు చేశారు. ఈ మూడు కారిడార్లకు సంబంధించిన ఎలైన్‌మెంట్లతో పాటు బుల్లెట్ రైలు స్టేషన్లను గుర్తించిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. కాగా, త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పట్టాలెక్కనున్నాయి.