కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. అమరావతికి 1500 కోట్లు కేటాయిస్తే అవి కూడా అప్పులేనన్న షర్మిల.. జీవనాడి పోలవరానికి రూ.3000 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు 2027కు ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. కేంద్రంలో పెద్దన్నగా చెప్పుకునే చంద్రబాబు వీటిపై ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. బాబుగారి అండతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినా.. రాష్ట్రానికి మాత్రం గుండుసున్నానే అంటూ షర్మిల ట్వీట్ చేశారు.