గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీని వీడి జనసేనలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తోట త్రిమూర్తులు స్పందించారు. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ మార్పు వార్తలు ఒట్టి ఊహాగానాలేనని తేల్చేశారు. తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.