వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి తన సింప్లిసిటీ నిరూపించుకున్నారు. ఓ చిన్నారికి వైఎస్ జగన్ చెప్పు అందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన గన్నవరం ఎయిర్‌పోర్టులో జరిగింది. వైఎస్ జగన్‌ను చూసేందుకు ఓ చిన్నారి తన తండ్రితో కలిసి ఎయిర్ పోర్టుకు వచ్చింది. అయితే ఎయిర్‌పోర్టులో ఆ చిన్నారి కాలి నుంచి చెప్పు జారిపడింది. ఈ విషయాన్ని గమనించిన వైఎస్ జగన్.. వెంటనే అక్కడకు చేరుకుని ఆ చిన్నారికి చెప్పును తీసి అందించారు. అనంతరం ఆప్యాయంగా పలకరించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.