ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మరో నేత వైసీపీని వీడారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన ఎమ్మెల్సీ పదవికి సైతం జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏపీ శాసనమండలి ఛైర్మన్ మోషేన్‌రాజుకు పంపించారు. గతంలో టీడీపీలో పనిచేసిన జయమంగళ వెంకటరమణ.. 2023 ఫిబ్రవరిలో వైసీపీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే 2024 ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీతో అంటీముట్టనట్టుగా ఉంటున్న ఆయన.. శనివారం రాజీనామా ప్రకటించారు.