రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ట్యాంకర్ లారీ ఢీకొనడంతో స్కూటీపై వెళ్తున్న మచ్చేందర్, ఆయన కుమార్తె మైత్రి అక్కడికక్కడే మృతి చెందారు. లారీ టైర్ల కింద ఇరుక్కున్న మైత్రి.. నన్ను కాపాడండి ప్లీజ్ అంటూ చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.