గ్రేటర్ హైదరాబాద్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బాలల దినోత్సవం నాడు ఈ పథకం ప్రారంభం కానుంది. దీని ద్వారా 1.50 లక్షల మంది చిన్నారులకు పోషకాహారం అందుతుంది. కేంద్రాల్లో సౌకర్యాల మెరుగుదలకు కూడా చర్యలు చేపడుతున్నారు.