తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు శుభవార్త అందించింది. వారి పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కూడా పెంపొందించింది. టీచర్లకు ఇప్పుడు రూ. 2 లక్షలు, హెల్పర్లకు రూ. 1 లక్ష ప్రయోజనంగా లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకునే వారికి కూడా ఈ పెంచిన ప్రయోజనాలు వర్తిస్తాయని జీవోలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం అంగన్వాడీ కార్యకర్తల సేవలను గుర్తించడమే కాకుండా, వారి ఆర్థిక భద్రతను పెంపొందిస్తుంది.