ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ బిజిబిజీగా గడుపుతున్నారు. మంగళవారం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చించారు. హైదరాబాద్‌లో ఈసీ, మూసీ నదుల సంగమ స్థలంలోని బాపూఘాట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. రక్షణశాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. బాపూఘాట్ ప్రత్యేకతలకు ఆయనకు వివరించారు.