దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన పిలుపునిచ్చారు. కేరళలోని తిరువనంతపురంలో ప్రముఖ దినపత్రిక మాతృభూమి ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యంగం ప్రసాదించిన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఒక్కటవ్వాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సుపరిపాలన ఉంటే ఏడాదిలోనే ఎంత మార్పు వస్తుందన్నదానికి తెలంగాణే ఓ ఉదాహరణ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.