ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్‌కు సమస్యలు తెలుసుకానీ.. వాటికి సొల్యూషన్స్ తెలియవని ఎద్దేవా చేశారు. అందుకే హిమాయాలకు వెళ్లిపోవాలని, నీకు రాజకీయం రాదని ముఖం మీదే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, ఇది అర్ధం కాక ఆయన నవ్వుతున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రమాణస్వీకారానికి హాజరైన పవన్‌ను చూసి మోదీ చమత్కరించిన విషయం తెలిసిందే. పవన్ మాటలు, చేష్టలు ప్రజలందరికీ అర్ధమైపోయిందని, ఆయన రాజకీయాలకు పనికిరానని తెలిసిపోయిందని అన్నారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ పోరాటం ఆపేసి.. ప్రజా సమస్యల కోసం అసెంబ్లీలో నిలదీయాలని డిమాండ్ చేశారు.