అందుకే మిమ్మల్ని పక్కనబెట్టారు.. విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్..

1 week ago 5
అమరావతి నిర్మాణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి చేసిన సలహాలు, సూచనలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో తొలుత అసెంబ్లీ, సచివాలయం వంటి కనీస సౌకర్యాలను నిర్మించి.. ఆ తర్వాత సహజసిద్ధంగా రాజధాని ఎదిగేందుకు అవకాశం ఇవ్వాలని విజయసాయిరెడ్డి సూచించారు. రాజధాని కోసం అప్పులు చేసి ప్రజలపై ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన బుద్ధా వెంకన్న.. గొప్ప రాజధాని నగరాలన్నీ పెట్టుబడులు పెడితేనే అభివృద్ధి చెందాయంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు.
Read Entire Article