ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరావు చేసిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు సర్కార్.. ఈ కేసులో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మీద చర్యలకు ఉపక్రమించింది. అయితే.. ప్రభుత్వ నిర్ణయంపై సునీల్ కుమార్ ఓ ట్వీట్ చేయగా.. దానిపై కూడా చర్యలు తీసుకోవటం గమనార్హం. ఈ వ్యవహారంపై ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఘాటుగానే స్పందించారు.