నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద ఓ అంబులెన్స్ దొంగ హల్‌చల్ చేశాడు. హయత్‌నగర్‌లో 108 అంబులెన్స్‌ను చోరీ చేసిన దొంగ విజయవాడ వైపు వెళ్తూ.. టేకుమట్ల స్టేజీ వద్ద పోలీసులకు చిక్కాడు. హయత్‌నగర్ పీఎస్ నుంచి నకిరేకల్ పీఎస్ వరకు పోలీసులకు చిక్కకుండా దొంగ వారిని ముప్పతిప్పలు పెట్టాడు. సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసిన పోలీసులు చివరికి అతడిని పట్టుకున్నారు.