సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 'జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ' రూపుదిద్దుకోనుంది. 3,245 ఎకరాల్లో నిర్మించనున్న ఈ సిటీ ద్వారా 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. మౌలిక సదుపాయాల పనుల టెండర్లు అక్టోబర్‌లో ఖరారు కానున్నాయి. ఒకటిన్నర సంవత్సరంలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.