బతిమిలాడినా పోలీసులు జైలుకు పంపటం లేదని యువకుడి విధ్వంసం.. మరీ ఇలా ఉన్నావేంట్రా..!

2 months ago 11
హైదరాబాద్‌లో ఒక వింత నేర ఘటన వెలుగుచూసింది. సాధారణంగా నేరస్థులు జైలుకు వెళ్లడానికి భయపడి పారిపోతుంటే.. ఆగాపురాకు చెందిన రౌడీషీటర్ షేక్ అస్లాం మాత్రం జైలుకు వెళ్లటమే ధ్యేయంగా ఒక హోటల్‌లో విధ్వంసం సృష్టించాడు. కొందరు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని.. జైల్లోనే తనకు ప్రశాంతత, రక్షణ ఉంటాయని భావించిన అస్లాం.. వారం రోజులుగా తనను జైలుకు పంపాలని పోలీసుల చుట్టూ తిరిగాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో కావాలనే గొడవ చేసి జైలుకు వెళ్లాలనే ప్లాన్‌తో స్థానిక సెంట్రల్ హోటల్‌లో వీరంగం సృష్టించాడు. చివరకు హబీబ్‌నగర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Read Entire Article