Srisailam Elevated Corridor Dornala To Atmakur Update: శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌కు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. దోర్నాల నుంచి ఆత్మకూరు వరకు 42 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఫ్రీ జర్నీ చేయొచ్చు.