తెలంగాణలో 'సర్' సర్వే.. గల్ఫ్ కార్మికుల్లో కొత్త టెన్షన్, ఓటు హక్కుకు ముప్పు ఉంటుందా..?

2 months ago 13
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై విదేశాల్లో ఉంటున్న తెలుగు ప్రవాసీయులకు కనీస అవగాహన లేదని సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) వెల్లడించింది. వారి ఓటు హక్కును కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని కోరింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న దాదాపు 8 నుంచి 10 లక్షల మంది తెలుగు వారిలో అత్యధికులు బ్లూ కాలర్ కార్మికులేనని.. వారికి ఈ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు డిజిటల్ సదస్సులు నిర్వహించాలని సాటా జనరల్ సెక్రటరీ ముజమ్మిల్ షేక్ డిమాండ్ చేశారు.
Read Entire Article